సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

0
TMedia (Telugu News) :

సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఖని లో సిపిఐ జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ విడుదల

టి మీడియా,అక్టోబర్ 06,గోదావరిఖని :

పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సిపిఐ రామగుండం నగర కార్యదర్శి కే.కనకరాజ్ అన్నారు.గురువారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో జరిగిన సిపిఐ 24వ జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ విడుదల కార్యక్రమం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్ తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశంలో సిపిఐ పార్టీ 1925 సంవత్సరం లో ఆవిర్భావం జరిగిందని, నాటి నుండి నేటి వరకు ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 14నుండి18 వరకు విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మహాసభలకు మన దేశంతో పాటు ప్రపంచంలోని 40దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని, ఇట్టి మహాసభలను జయప్రదం చేయడం కోసం సిపిఐ కి ఆర్థికంగా, హార్థికంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన నగర ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సమితి నాయకులు తాల్లపెల్లి మల్లయ్య,మద్దెల దినెష్, టి.రమేష్ కుమార్,మాటేటి శంకర్,బోడకుంట కనకయ్య,ఎర్రల రాజయ్య, మార్కపూరి సూర్య, రేణికుంట్ల ప్రీతం,చిలుముల రాజయ్య,బోళ్ళ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube