వినతులు పరిష్కారానికి చర్యలు తీసుకోండి

వినతులు పరిష్కారానికి చర్యలు తీసుకోండి

0
TMedia (Telugu News) :

వినతులు పరిష్కారానికి చర్యలు తీసుకోండి

-అధికారులు కు కలెక్టర్ వీపీ గౌతం ఆదేశం

టీ మీడియా,సెప్టెంబర్ 26, ఖమ్మం: ప్రజావాణి వినతుల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ఫార్వార్డ్ చేశారు. ఈ సందర్భంగా చింతకాని మండలం గ్రామం నుండి ఎం. శంకర్ తమ భూమి విషయమై పాస్ బుక్ లో తగ్గించిన విస్తీర్ణం సరిచేయాలని కోరగా, తహసీల్దార్ పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రఘునాథపాలెం మండలం హరియా తాండ నుండి బానోతు తులసి, తన భూమి సర్వే నెం. 674 కు బదులుగా 539/11/2 గా పివోపి పట్టా చేశారని, అట్టి దానిని రద్దు చేసి, 674 గా మార్చి పాస్ బుక్ ఇప్పించుటకు కోరగా, పరిశీలనకై తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం బచ్చొడు తాండ ప్రజలు తమ గ్రామంలో సిసి రోడ్లు, సైడ్ డ్రయినేజీలు, వీధి లైట్ల కోసం కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. స్థానిక గాంధీనగర్, అర్కంబావి వీధి నుండి బుద్ద మేరీ డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరుకు కోరగా, పరిశీలనకై ఖమ్మం అర్బన్ తహసీల్దార్ ను ఆదేశించారు. చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామ రైతులు తాము కరంట్ కొరకు డీడీలు కట్టి 2 సంవత్సరాలు అయిననూ, ఇంకా కరంట్ లైన్, ట్రాన్స్ఫార్మర్స్ రాలేదని ఇప్పించగలందులకు కోరగా, విద్యుత్ ఎస్ఇ ని వెంటనే చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.

also read :జమ్మిబండ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

 

కామేపల్లి మండలం రామకృష్ణాపురం నుండి భాగం అనసూర్యమ్మ తన పెన్షను వేరే ఖాతాలో పడుతుందని, తన ఖాతాలో పడే విధంగా చేయాలని కోరగా, డిఆర్డీవో ను వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొనిజర్ల మండలం శాంతినగర్ ఎస్టీ కాలనీకి చెందిన బానోతు నానికి, తన కుమారుడు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ, గుండెపోటుతో మృతి చెందగా, తన కోడలికి కారుణ్య నియామకం కల్పించినట్లు, తన కోడలు తనను పట్టించుకోవట్లేదని న్యాయానికి కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. కొనిజర్ల మండలం నుండి భూక్య వంశీ, తన అక్క కళ్యాణలక్ష్మి చెక్కు ఇప్పించగలందులకు కోరగా, ఆర్డీవోను చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.

also read :సి.సి రోడ్లను వెంటనే నిర్మించాలి

కల్లూరులోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న వైరా మండలం సిరిపురం (కేజీ) గ్రామానికి చెందిన కె. సుజాత తన కుమారుడు కల్లూరులో విద్యుత్ ప్రమాదంలో చనిపోయినట్లు, మరణధృవీకరణ పత్రం కొరకు కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన సండ్ర ఉమ తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తమకు ఇప్పించగలందులకు కోరగా, చర్యలకై తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్డీవో విద్యాచందన, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube