బావులను తలపిస్తున్నా గుంతలు

0
TMedia (Telugu News) :

అద్వానంగా మారిన రహదారితో ఇక్కట్లు

టీ మీడియా, నవంబర్ 22, మహానంది:
మహానంది మండలంలోని మహానంది ఫారం వద్ద రహదారి గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు గుంతలతో అద్వానంగా మారింది. ఈ బావులను తలపిస్తున్నా గుంతలతో మహానంది క్షేత్రానికి, పరిసర గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహానంది నుంచి మహానంది ఫారం వరకు మూడు కిలోమీటర్లు వెళ్లాలంటే నరకం అనుభవించాల్సి వస్తుందని వాహన దారులు వాపోతున్నారు. సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని వాహన దారులు కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube