సిరివెన్నలకు పీజేయస్ క్లబ్ ఘన నివాళులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 30

తెలుగు సినీమా సాహిత్యాన్నీ ప్రపంచ స్థాయి కి పరిచయం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం హఠాన్మరణం తో యావత్తు సినిలోకం ఆయన అభిమానులు నివ్వెరబోయ్యారు. ఈ క్రమంలో స్థానిక ప్రొఫెసర్ జయశంకర్ సర్ ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాక్షి వాసు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా సాహిత్యనికి సిరివెన్నెల మకుటంలేని మహారాజు అని ఆయన బౌతికంగా లేక పోయినా ఆయన సాహిత్యం తరతారలు తారలోకాన్ని శాశిస్తుంది అని అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన మించిన రచయిత తెలుగు సాహిత్యం లో ఎవ్వరు భర్తీ చేయలేరని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పీజేయస్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి వెంకటేశ్వరరావు,షేక్ మౌలాలి,లింగిశెట్టి ధర్మ,రోహిణి,కభంపాటి భాస్కర్ కేసిబోయిన వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube