మత్స్య భవన్ కు స్థలం కేటాయించిన మంత్రి

మత్స్య భవన్ కు స్థలం కేటాయించిన మంత్రి

0
TMedia (Telugu News) :

మత్స్య భవన్ కు స్థలం కేటాయించిన మంత్రి

 

టీ మీడియా, అక్టోబర్ 8, వనపర్తి బ్యూరో :వనపర్తి పట్టణంలోని నాగవరం శివారులో గల 208 సర్వే నెంబర్లు వనపర్తి మత్స్యకార భవన్ కు 35 కుంటల స్థలాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో స్థలం కేటాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్థల కేటాయింపులు ఉత్తర్వులను జారీ చేశారు. 35 గుంటల స్థలం యొక్క ప్రొసీడింగ్స్ ను మంత్రి చేతుల మీదుగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ లక్ష్మయ్యకి మంత్రి అందించారు.ఈ సందర్భంగా మంత్రికి మత్స్యకారులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read : రాష్ట్రం దాటుతున్న రేషన్ బియ్యం

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మత్స్యకారులను ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప మత్స్య ముదిరాజ్ తెలుగు జాతి కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి నాయకత్వంలో చెరువులను కుంటలను కాలువల ద్వారా నీటితో నింపి జలకలను తీసుకొచ్చారన్నారు. అంతే కాకుండా మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకోవడంలో భాగంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ 100% సబ్సిడీతో అదే విధంగా పనిముట్ల పంపిణీ సబ్సిడీపై పంపిణీ చేయడం జరిగిందని దీని ద్వారా మత్స్యకారుల్లో ఆర్థిక జీవనస్థితి మెరుగుపడిందని సంతోషం వ్యక్తం చేశారు. స్థలం కేటాయించినందుకు మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube