హరితహారం అక్రమాలకు చోటునిస్తుంది.

హరితహారం అక్రమాలకు చోటునిస్తుంది.

1
TMedia (Telugu News) :

హరితహారం అక్రమాలకు చోటునిస్తుంది.

టీ మీడియా, జూలై 23, వనపర్తి బ్యూరో : గత ఐదు ఆరు విడుదలగా జరుగుతున్న హరితహారం నాటిన మొక్కలు లక్షల్లో ఉండాలి.కానీ వనపర్తి మొత్తంలో వెయ్యి మొక్కలు కూడా లేవు.ఎందుకంటే ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే హడావిడిగా మునిసిపాలిటీలో అత్యవసర సమావేశం పెట్టి కోట్లల్లో నిధులు తీర్మానం చేసి పేపర్ మీద మాత్రం లక్షల్లో మొక్కలు నాటినట్లుగా చూపి కనీసం వేళల్లో నాటిన మొక్కలను కూడా రక్షించడం లేదు. కౌన్సిలర్లతో నాటిన మొక్కలు కొన్ని మాత్రం బతుకు తున్నాయి.మిగతా మొక్కలకు మెయింటెనెన్స్ లేక చనిపోతున్నాయి.ఆ మొక్కలను శనివారం అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించడం జరిగింది.అక్కడ గుంత ఉన్నది నాటిన మొక్క లేదు దానికి కట్టిన కట్టే మాత్రమే ఉంది. కొన్నిచోట్ల ,టైగాడ్స్ కూడా లేవు.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలలో, అవినీతిలో, ఉన్నతాధికారులు చేస్తున్న కమీషన్ల పర్వంలో అందరూ మునిగితేలుతున్నారు. దీనికి ఒక మధ్య అధికారి సూత్రధారి అని తెలుస్తుంది. దీనిలో భాగంలో దొరికిన ఈ హరితహారం పథకం. వారికి కల్ప తరువై కూర్చున్నదని మున్సిపాలిటీలోని కొందరు గుస గుసలాడుకుంటున్నారని . అయితే పట్టణ హరితహారంలో నర్సరీలు ఎన్ని ఉన్నాయి.

 

Also Read : కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

ఆ నర్సరీలు ఎవరికి కాంట్రాక్టుకు ఇచ్చారు, ఎంత రేటుకి ఇచ్చారు, చెట్టు ధర ఎంత నర్సరీ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్న చెట్లు ఎన్ని వివిధ ప్రదేశాల్లో నాటిన చెట్లు ఎన్ని నాటిన చెట్లల్లో వృద్ధి చెందినవిని, వృద్ధి చెందని ఎన్ని.వృద్ధి చెందకుండా నాశనమైన చెట్లకు కారణం ఎవరు.ట్రీ గార్డులు ఎన్ని బిగించారు. ఒకవేళ బిగించ లేకపోతే ఎందుకు బిగించలేదు.ట్రీ గార్డులు ఎవరు నుంచి కొనుగోలు చేశారు ఎంత ధర కొనుగోలు చేశారు.హరితహారం సంబంధించి అటవీశాఖ వారు మున్సిపల్ శాఖ వారికి ఇచ్చిన ఆదేశాలు ఏంటివి.చెట్లకు నీళ్లు పోయటకు నీలా కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారు. ఎన్ని ట్యాంకులు నీళ్లు పోసారు ఏ ఏ దారిలో నీళ్ల ట్యాంకులను ఉపయోగించారు. అని సతీష్ యాదవ్ ప్రశ్నించారు.
ఈ విషయాలన్నిటిని అఖిలపక్ష ఐక్యవేదిక తరపున కమిషనర్ కి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఇచ్చిన
వినతిప్రతానికి ఒక నెల దాటినా సమాధానం ఇవ్వలేదు. అయినా మేము చట్ట ప్రకారము
పై అధికారులకు తెలుపుతాము అన్నారు .
పై విషయాలన్నింటిపై అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే విచారణ చేయించి, హరితహారం పై నిర్లక్ష్యం వహిస్తూ కమిషన్లు తింటున్న మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ల పై తగు చర్య తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు .ఎందుకంటే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని ఈరోజు వరకు ప్రశ్నించని కౌన్సిలర్లు, ఇందులో భాగస్వాములే కదా ప్రజల అభ్యర్థనను స్వీకరించిన అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో నాటిన మొక్కలను పరిశీలించడం జరిగింది.
కానీ ఎక్కడ చూసినా మొక్కలు లేవు కానీ గుంతలు ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్, కో కన్వీనర్ చిరంజీవి,ఉపాధ్యక్షులు వెంకటేష్,జయ రాములు, కార్యదర్శులు రమేష్,రాజనగరం రాజేష్,బల్మూరు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube