16 రకాల ప్లాస్టిక్ వస్తువుల పై నిషేధం విధించిన కేంద్రం

జూలై ఒకటో తేదీ నుంచి అమలు

1
TMedia (Telugu News) :

16 రకాల ప్లాస్టిక్ వస్తువుల పై నిషేధం విధించిన కేంద్రం

– జూలై ఒకటో తేదీ నుంచి అమలు

టి మీడియా,జూన్ 20,ఢిల్లీ:
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనిషి జీవితంలో ఓ భాగంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై నిషేధించింది. ఏకంగా 16 రకాలైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకిరానుంది. నిషేధం విధించిన ప్లాస్టిక్‌లో ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు ఉన్నాయి. పైగా, ప్లాస్టిక్ ముడి పదార్థాలను సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలను కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Also Read : ధరలు పెరిగిన తగ్గని అమ్మకాలు

కేంద్రం నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీమ్ కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ వంటి 16 రకాస వస్తువులు ఉన్నాయి.అలాగే, ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు ఎలాంటి ప్లాస్టిక్ ముడి సరకులులను సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అలాగే వాణిజ్య సంస్థలేవనీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించరదంటూ స్థానిక సంస్థలు కూడా ఆదేశాలు జారీ చేయాలని, వీటిని ఉల్లఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube