పేకాట, జూదం తో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు..!

 పేకాట, జూదం తో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు..

2
TMedia (Telugu News) :

 

 

GAME
GAME

పేకాట, జూదం తో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు..!
-జోరుగా మూడు ముక్కలాట..!

-రూ. క్షల్లో చేతులు మారుతున్న డబ్బు
-వ్యవసాయ క్షేత్రాలు, లాడ్జి ప్రత్యేకంగా రూమ్‌ అడ్డాలు
-సకల సౌకర్యాలతో స్థావరాలు.. చెంతకే మందు, విందు
– అప్పు ఇచ్చేందుకు వ్యాపారులూ అక్కడే!

ఏదైనా తాకట్టు పెట్టుకోవడానికీ రెడీ.. రూ. 10 వడ్డీ వసూలురామచంద్రపురం ప్రతినిధి న్యూస్ : పేకాట..మద్యం…కో డి పందాలు…ఇవన్నీ వ్యసనాలు.. పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నట్లుగా ఒక్కో మనిషికి ఒక్కో వ్యసనం బారిన పడుతుంటారు. వీటి మోజులో పడ్డారంటే జీవితాలు ఛిద్రమవ్వాల్సిందే. సరదాకు ఆడుకునే పేకాట కొందరికి వ్యసనంలా మారుతోంది. మూడు ముక్కలాటలో ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. సర్వస్వం పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆవేదనలో మద్యానికి బానిసవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో రామచంద్రపురం డివిజన్ లో రామచంద్రపురంతో పాటు, అనపర్తి, మండపేట, ద్వారపూడి, బిక్కవోలు, కాజులూరు, కపిలేశ్వరపురం లో పేకాట జోరుగా సాగుతున్నది. ప్రతీరోజు రూ. లక్షల్లో చేతులు మారుతున్నది. రామచద్రాపురం డివిజన్ లో పేకాటకు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నది. పోలీసులు దాడులుచేస్తూ కేసులు నమోదు చేసినా పలువురు అడ్డాలు మారుస్తూ ఆటను కొనసాగిస్తున్నారు. అవారాగాళ్ల నుంచి బడాబాబుల వరకు జోరుగా పేకాట ఆడుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మూడుముక్కలాటలో మునిగితేలుతున్నారు. రామచంద్రపురంలో కొంతమంది పేకాట కోసం,లాడ్జి ప్రత్యేకంగా రూమ్‌లు తీసుకుని రాత్రింబవళ్లు ఆడుతున్నట్టు తెలిసింది. మరికొంతమంది ఆయా మండల శివారులోని గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాల వద్ద రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ప్రతీరోజు అడ్డాలు మారుస్తున్నారు. చుట్టుపక్కల చీమ చిటుక్కుమన్నా సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుక

Also READఅవి ప్రభుత్వ స్థలాలు-స్వాధీనం చేసుకోండి

స్థావరాల వద్దకే సకల సౌకర్యాలు:
పేకాట ఆడేవారు ఏ అవసరానికైనా బయటకు వెళ్లాల్సిన అవసరం రాకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారు. స్థావరాల వద్దకే ఆహారం, మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు కూడా అక్కడే ఉంటున్నారు. యువత ఎక్కువగా ఆభరణాలు, వాహనాలు తాకట్టుపెట్టుకుని అధిక వడ్డీకి అప్పులిస్తున్నారు. నూటికి పది రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చి, అక్కడే ఆడాలని నిబంధన పెడుతున్నారు.

ఇది కూడా చదవండి:  ఎక్సైజ్ సిఐపై బదిలీ వేటు

ప్రత్యేక సెంట్రీ ఏర్పాటు:
పేకాట స్థావరాలకు ఇతరులు ఎవరైనా వస్తే ముంద స్తుగా సమాచారం ఇవ్వడానికి కొందరు నిర్వాహకులు ప్రత్యేక సెంట్రీ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. పేకాట స్థావరాల చుట్టు పక్కల ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న సెంట్రీలు, అనుమానిత వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతారు. పోలీసులు గానీ, అనుమానిత వ్యక్తులు గానీ సంచరిస్తే వెంటనే నిర్వాహకులకు సమాచారం అందిస్తారు.

రోడ్డున పడుతున్న కుటుంబాలు:
పేకాట కారణంగా పలు కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. మద్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు పేకాట వ్యసనానికి గురై ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. కొందరు వ్యక్తులు కేవలం పేకాటనే వృత్తిలాగా ఎంచుకొని ఆడుతున్నారంటే అతిశయోక్తి కాదు. పలువురు పొరుగు జిల్లాలకు వెళ్లి పేకాట ఆడుతున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి పేకాటను నిర్మూలించాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.

,ఇది కూడా చదవండి: గానకోకిల లత మంగేష్కర్ కన్నుమూశారు

కళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు:
పేకాట ఆడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేదన వర్ణనాతీతం తమ కుటుంబాలకు చేందినవారే కళ్లేదుట పేకాట ఆడుతుండటం ఇదేమని ప్రశ్నిస్తేంటే ఆటలో ఉన్న వ్యక్తులు బెదిరిస్తున్నారని కన్నీళ్ల పర్యవంతమౌతున్నారు. కొన్ని ఇళ్లల్లో అర్ధరాత్రి వరకు నిత్యం పేకాట అడ్డు అదుపూ లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కొరుతున్నారు.

మొక్కుబడిగా దాడులు:
జూదం అడ్డాలు రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో పోలీసులకు తెలుసు అందువల్లనే పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్న ఎవరిని పట్టుకోలేక పోతున్నారు. ‘‘దాడుల సమయంలో గతంలో మండల పరిధిలోని కొన్ని గ్రామలో పట్టుబడిన జూదరులు పోలీసులకు ఎదురుతిరగడంతో పాటు మీ డీఎస్పీతో మాట్లాడాలా, మీ సీఐతో మాట్లాడాలా అసలు మీకు ఎవరు ఫిర్యాదు చేశారు వారి పేరు చెప్పండి అంటూ ఎదురు తిరగడంతో పోలీసులు వెనుదిరిగి వచ్చాని సంఘటనలు ఉన్నాయి’’.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube