ప్రధాన మంత్రి మోడీ డిక్టేటర్ ల వ్యవహరిస్తున్నాడు

పార్లమెంట్ గాంధీ విగ్రహం సాక్షిగా రాత్రి పూట ఎంపీల ధర్నా

1
TMedia (Telugu News) :

ప్రధాన మంత్రి మోడీ డిక్టేటర్ ల వ్యవహరిస్తున్నాడు

పార్లమెంట్ గాంధీ విగ్రహం సాక్షిగా రాత్రి పూట ఎంపీల ధర్నా

– సామాన్య ప్రజల వెంటే తెలంగాణ ప్రభుత్వం…

– కేంద్ర అధికార పక్ష ఎంపీ లకి కనువిప్పు కలగాలి…

– ధీక్షలో పాల్గొన్న తెలంగాణ రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర

టి మీడియా ,జూలై 28,ఢిల్లీ : జిఎస్టీ తొలగించే వరకు తెలంగాణ ఎంపీలు వెనక్కు తగ్గదేలేదని, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నిరసనతో ముందుకు వెళ్తామని రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర అన్నారు. బుధవారం ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద అర్ధరాత్రి వరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఉదయం వరకు సిద్ధంగా ఉన్నామని తేల్చేశారు.

 

Also Read : నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబిత

సస్పెన్షన్ ఎత్తివేయక పోయినా పర్వాలేదని, కానీ పేద ప్రజలకు భారమైన జిఎస్టీ ని తొలగిస్తే తమ నిరసనకు న్యాయం జరిగినట్టేనని భావిస్తామని అన్నారు. జిఎస్టీ తగ్గించే వరకు ఎలాంటి త్యాగలకైనా TRS ఎంపీలము సిద్ధమేనని, పేద ప్రజలకు నిత్యవసర ధరలపై సమన్యాయం జరిగితే చాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని దేశంలోని పేద ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube