ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్ వ‌ద్ద ప్ర‌ధాని దిష్టిబొమ్మ ద‌గ్ధం

ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్ వ‌ద్ద ప్ర‌ధాని దిష్టిబొమ్మ ద‌గ్ధం

1
TMedia (Telugu News) :

ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్ వ‌ద్ద ప్ర‌ధాని దిష్టిబొమ్మ ద‌గ్ధం
టి మీడియా, జూన్ 21,చెన్నై : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప‌ధ‌కం అగ్నిప‌థ్ స్కీంపై నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ధంతాయ్ పెరియార్ ద్ర‌విడార్ క‌జ‌గం (టీపీడీకే) కార్య‌క‌ర్త‌లు అగ్నిప‌థ్ ప‌ధ‌కాన్ని వ్య‌తిరేకిస్తూ మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్ వ‌ద్ద ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిష్టిబొమ్మ ద‌గ్ధం చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.ఆ ప్రాంతంలో హైఅల‌ర్ట్ కొన‌సాగుతున్నా టీపీడీకే కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు దిగ‌డంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద‌క్షిణ్ భార‌త్ ప్రాంతంలోని ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్ వ‌ద్ద‌కు చేరుకున్న టీపీడీకే కార్య‌క‌ర్త‌లు అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.అగ్నిప‌థ్ కుల‌తత్వాన్ని ప్రేరేపిస్తుంద‌ని, దీంతో యువ‌త జీవితాలు నాశ‌న‌మ‌వుతాయ‌ని టీపీడీకే అరియ‌లూర్ జిల్లా కార్య‌ద‌ర్శి రావ‌ణ గోపాల్ ఆరోపించారు. టీపీడీకే వాలంటీర్లు ప్ర‌ధాని దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేయ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రోవైపు అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా చెన్నై సెంట్ర‌ల్ స్టేష‌న్ వ‌ద్ద‌, త‌మిళ‌నాడు స‌చివాల‌యం వద్ద యువ‌కులు నిర‌స‌న‌ చేప‌ట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube