న‌మో భార‌త్ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

న‌మో భార‌త్ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

0
TMedia (Telugu News) :

న‌మో భార‌త్ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

టీ మీడియా, అక్టోబర్ 20, న్యూఢిల్లీ : ఢిల్లీ-ఘ‌జియాబాద్‌-మీర‌ట్‌ మ‌ధ్య రీజిన‌ల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్ట‌మ్‌(ఆర్ఆర్‌టీఎస్) కారిడార్‌ను శుక్రవారం ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. 17 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆ కారిడార్‌ను ప్ర‌జ‌ల కోసం ఈనెల 21వ తేదీన అందుబాటులోకి వ‌స్తుంది. ర్యాపిడ్ఎక్స్ ట్రైన్‌ను న‌మో భార‌త్ అని రైలుగా కూడా పిలుస్తున్నారు. స‌హిబాబాద్ నుంచి దుహాయి డిపో మ‌ధ్య రైలును న‌డిపారు. ఆ రైలులో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించారు. స్కూల్ పిల్ల‌లు, సిబ్బందితో ఆయ‌న రైలులో ముచ్చ‌టించారు. ఢిల్లీ-మీర‌ట్ కారిడార్ మొత్తం 2025 నాటికి పూర్తి కానున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్ఆర్‌టీఎస్ కారిడార్ కోసం స‌హిదాబాద్ స్టేష‌న్‌లో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కారిడార్ పూర్తి అయితే కేవ‌లం గంట లోపే ఆ దూరాన్ని చేరుకునే అవ‌కాశం ఉంటుంది.

Also Read ; సీఎంగా కేసీఆర్‌ చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. క‌నీస టికెట్ ధ‌ర రూ.20 కాగా, గ‌రిష్టంగా రూ.100 టికెట్ ఉండ‌నున్న‌ది. ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ ప్ర‌భుత్వాల స‌హకారంతో ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube