24న జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
24న జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
24న జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
టీ మీడియా, ఏప్రిల్ 6,న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 24న జమ్ముకశ్మీర్‌ను సందర్శిస్తారు. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్నిరద్దు చేయడంతోపాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కశ్మీర్ లోయలో ప్రధాని పర్యటించడం ఇదే తొలి సారి కానున్నది. ప్రధాని మోదీ పర్యటనలో కశ్మీర్ పండిట్ల ప్రతినిధులతో సమావేశం అవుతారని బీజేపీ ప్రధానకార్యదర్శి (ఆర్గనైజేషన్) అశోక్ కౌల్ మంగళవారం చెప్పారు. కశ్మీర్ పండిట్ల సమస్యలను, వారి ఆందోళనలను ప్రధాని మోదీ తెలుసుకుంటారన్నారు. జమ్ముకశ్మీర్‌ను మోదీ ప్రభుత్వం పర్యాటక రాజధానిగా మార్చేసిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఇంతకుముందు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో సమాన అభివృద్ధి సాధించడానికి బీజేపీ ప్రతీన బూనిందన్నారు. ఇది తమ ప్రభుత్వ కల, నిబద్ధత అని.. ఈ లక్ష్యాల సాధనకు కృషి సాగుతుందన్నారు.నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఎల్లవేళలా జమ్ముకు వ్యతిరేకంగా కశ్మీర్‌ను నిలపడానికే ప్రయత్నించాయని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు చైనా, పాకిస్థాన్లతో స్నేహం గురించి మాట్లాడతాయన్నారు. విషపూరిత సిద్ధాంతంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వాటి డీఎన్ఏలోనే ఉందన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఉన్నంత వరకు వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు.
Also Read : ఈ రెస్టారెంట్లలో ఎప్పుడైనా హలీమ్ టేస్ట్ చూశారా?
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube