ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

1
TMedia (Telugu News) :

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

టి మీడియా,జూలై1,ఆలమూరు : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4వ తేది సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ, సభను విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ పాలూరు సత్యానందం అన్నారు. ఆలమూరు మండలం చొప్పెల్లలో బిజెపి మండల ఉపాధ్యక్షులు ఏడిది సూరి గోపాలాచార్యులు ఆద్వర్యంలో జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలూరి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మునిసిపల్‌ పార్కులో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణకు భారీ స్థాయిలో కార్యకర్తలు రావాలని అన్నారు.

 

Also Read : రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా: సీపీఐ నారాయణ

జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు పిలుపుమేరకు మండలంలో ఉన్న శక్తి కేంద్రాలు, భూత్ స్ధాయి నాయకులు అందరూ తరలివచ్చి ఈసభను విజయవంతం చేయాలని కోరారు. అన్ని గ్రామాల్లో సమావేశం ఏర్పాటుచేసి ప్రతి కార్యకర్త పాల్గొనేలా చూడాలని ఈ సభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినవిల్లి సత్తిబాబు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డీ దొరయ్య నాయుడు, మండల ఉపాధ్యక్షులు తోరాటి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube