నేడు సీఎం లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోన కట్టడి పై సమీక్ష

1
TMedia (Telugu News) :

నేడు సీఎం లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

-కరోన కట్టడి పై సమీక్ష

టి మీడియా, ఎప్రిల్ 27,డిల్లీ: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్న ఆయా రాష్ట్రాలు.. కొవిడ్‌ ఆంక్షలను మళ్లీ అమలు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోదీ చర్చించనున్నారు.

దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

 

Also Read : మహానందీశ్వరుని సన్నిధిలో శ్రీశైలం ఈవో లవన్న

 

ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించనున్నారు. అయితే, మే నెలలో పండుగలు ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతికదూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మొన్నటి ‘మన్‌కీ బాత్‌’ ప్రసంగంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉంటే, గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా నిత్యం 2వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 15వేలు దాటింది. దేశ రాజధాని దిల్లీలో పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడంతోపాటు ఆర్‌-విలువ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆంక్షలు అమలు చేసే పనిలో నిమగ్నమైన రాష్ట్రాలు.. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా నాలుగో వేవ్‌ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube