గవర్నర్ కి వినతి పత్రం అందించిన పొదెం వీరయ్య

గవర్నర్ కి వినతి పత్రం అందించిన పొదెం వీరయ్య

0
TMedia (Telugu News) :

గవర్నర్ కి వినతి పత్రం అందించిన పొదెం వీరయ్య

టి మీడియా, ఫిబ్రవరి 21, భద్రాచలం : శాసనసభ్యులు పొదెం వీరయ్య రాష్ట్ర గవర్నర్ తమిళ సై ని రాజ్ భవన్ లో మూడు పంచాయతీల జీవో 45 రద్దు మరియు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అనైతికంగా ప్రవేశపెట్టినటువంటి ఆమోదించినటువంటి తీర్మానాన్ని చట్టం చేయవద్దని, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కొరకు రైతుల భూములను అతి తక్కువ నష్టపరిహారంగా 8 లక్షల రూపాయలకు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని 30 లక్షలు రూపాయలకు పెంచాలని కోరుతూ వినతి పత్రం అందించారు.పుణ్యక్షేత్రమైన భద్రాచలo ప్రాంతాన్ని మూడు పంచాయతీలుగా విభజించడానికి భద్రాచలo ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్ర విభజన అనంతరం ముంపు మండలాలు ఏపీలో కలపటం వల్ల భద్రాచలo ప్రాంతం రెండు కిలోమీటర్ల లోపే ఉందని ఇప్పటికే డంపింగ్ యార్డ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భద్రాచలాన్ని మూడు ముక్కలుగా విభజిస్తే భద్రాచల ప్రజలు సాంకేతికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, జీవో నెంబర్ 45 ద్వారా అసెంబ్లీలో ఆమోదం పొంది మీ దగ్గరికి వచ్చిన మూడు పంచాయతీల బిల్లును పున పరిశీలన చేసి రద్దు పరచాలని, పుణ్యక్షేత్రమైన భద్రాచలo ప్రాంత అభివృద్ధి విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేసే విషయంలో సహాయం చేయాలని కోరారు.

Also Read : తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుదాం

దుమ్ముగూడెం మండలం సీతమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి ఇచ్చే నష్టపరిహారం సరిపోదని,నష్టపరిహారాన్ని 30 లక్షల వరకు పెంచాలని అసెంబ్లీ వేదికగా శాసనసభ్యుడిగా నేను వివరించిన ప్రభుత్వం దృష్టి సారించలేదని,తమరు ఆలోచించి రైతులకు న్యాయం చేసే విధంగా సహాయం చేయాలని కోరారు.భద్రాచల ఆడబిడ్డ గొంగడి త్రిష అండర్ 19 ఉమెన్స్ క్రికెట్ టీం లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందలేదని, సహాయం అందే విధంగా తమరు సిఫారసు చేయాలని శాసనసభ్యులు కోరారు.భద్రాచల ప్రాంత సమస్యలపై గవర్నర్ ను కలిసిన వారిలో..పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్,టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,బోగాల శ్రీనివాస్ రెడ్డి,భద్రాచల హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, తెల్లం నరేష్, బూర లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube