పోడుభూముల దరఖాస్తులు స్వీకరణ

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్18,కరకగూడెం:

కరకగూడెం మండల వ్యాప్తంగా పోడు సాగుదారుల నుండి దరఖాస్తులు వెల్లువల అధికారులు స్వీకరిస్తున్నారు.ఈ క్రమంలో గురువారం పద్మాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పోడు సాగుదారుల నుండి దరఖాస్తులను ఎఫ్ఆర్సీ కమిటీ,రెవెన్యూ అధికారులు,స్థానిక సర్పంచ్ తాటి సరోజిని సమక్షంలో స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరలోనే అర్హులైన పోడు సాగుదారులకు పట్టాలు వస్తాయని తెలిపారు. పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పోడు భూముల హక్కుల పత్రాల కోసం రైతుల నుంచి నేటివరకు 378 దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి మనికిరణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ పడిగా సమయ్య,కమిటీ సభ్యులు ఈసం నాగేశ్వరరావు,పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Podu cultivators across Karakagoodem zone.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube