పోలవరం నిర్మాణం నిర్వాసితుల సమస్యలపై

సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టీ.అరుణ్ వెల్లడి

1
TMedia (Telugu News) :

పోలవరం నిర్మాణం నిర్వాసితుల సమస్యలపై.
సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టీ.అరుణ్ వెల్లడి.
టీ,మీడియా,మార్చి 22,రాజమండ్రి :పోలవరం నిర్మాణం నిర్వాసితుల సమస్యలపై పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, టి. అరుణ్ వెల్లడించారు.సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం చాలా ప్రాధాన్యతతో కూడుకున్నదని, బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై ఆడుతున్న దొంగ నాటకాలను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పై సవతి తల్లి ప్రేమ చూపించటం తదితర అంశాలపై ప్రధాన వ్యక్తులు మాట్లాడతారని వారన్నారు. ఈ సమావేశానికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మీడియం బాబురావు, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వి. శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా రాష్ట్ర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు, పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ నాయకులు కందుకూరి శైలజ, బొప్పన కిరణ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే.రాంబాబు, వంగమూడి కొండల రావు, బొమ్మసాని రవిచంద్ర, సిపిఎం సీనియర్ నాయకులు మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి పవన్, పూర్ణిమా రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube