పోలవరం ఆర్ ,ఆర్ రీసర్వే చేసి ముంపు వాసులను జాబితాలో చేర్చాలి

పోలవరం ఆర్ ,ఆర్ రీసర్వే చేసి ముంపు వాసులను జాబితాలో చేర్చాలి

1
TMedia (Telugu News) :

పోలవరం ఆర్ ,ఆర్ రీసర్వే చేసి ముంపు వాసులను జాబితాలో చేర్చాలి

టీ మీడియా.అక్టోబర్18,చింతూరు : పోలవర ముంపు ఆర్ & ఆర్ లిస్ట్ లో చిడుమూరు లోని సవలం కన్నయ్య గుంపు లోని 14 కుటుంబాలు రాలేదని మొదట మునిగే ఇళ్లను లిస్ట్ లో చేర్చకపోవడం అన్యాయమని తక్షణమే రి సర్వే చేసి ఆ గుంపు లోని ఇళ్లను ఆర్ &ఆర్ జాబితాలో లో చేర్చాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసిందిమంగళవారం నాడు చిడుమూరు లోని సవలం కన్నయ్య (అంగన్వాడీ 2 సెంటర్ ) గుంపు లోని 14 ఇల్లులు వరద వచ్చినప్పుడు అల్లా మునుగుతున్నాయని, ఇంటి ముందు ఇల్లు ముంపు లో ఉండి, ఈ ఇల్లులు ముంపు లో లేకపోవడం అన్యాయం అని సిపిఎం జిల్లా నాయకులు కుంజా. సీతారామయ్య, పల్లపు. వెంకట్, యర్రంశెట్టి. శ్రీనివాసులు, ఎంపీటీసీ ముర్రం లక్ష్మి అన్నారు.

Also Read : రక్తదాన శిబిరం లో పాల్గొన్న మహిళలు

అధికారులు చేసే సర్వేలు తప్పుల తడకాలుగా, అయోమయంగా ఉన్నాయని ఆరోపించారు. అప్పులో వున్న ఇల్లులు ముంపు లో ఉండి డౌన్ లో వున్న ఇల్లులు ముంపు లో లేవని చెప్పడం అధికారుల అవగాహనాలోపంస్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. అధికారులు ఇప్పటి కైనా ద్రుష్టి పెట్టి చిడుమూరు లోని సవలం కన్నయ్య,తుర్రం లాలమ్మ, తుర్రం సుబ్బయ్య,తుర్రం. చంద్రయ్య, తుర్రం మహేష్,గొడ్డెలా బజారమ్మ, పులి కన్నమ్మ,సున్నం ముత్తమ్మ, సున్నం భీమమ్మా, సున్నం గంగమ్మ,గెడ్డలా పెద్ద బజారమ్మ, గెడ్డలా ముత్తయ్య, సోడి ముత్తయ్య, తుర్రం లాలమ్మ 14 మంది ఇళ్లను రి సర్వే చేసి ముంపు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం చిడుమూరు సచివాలయం కార్యదర్శి కి డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కార్యదర్శి మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం ఆర్ & ఆర్ వాళ్లకు తెలియచేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమం లో ముంపు వాసులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube