నిందితుడి అకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన పోలీస్ బాస్

నిందితుడిఅకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన పోలీస్ బాస్

1
TMedia (Telugu News) :

నిందితుడిఅకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన పోలీస్ బాస్

టి మీడియా, మే10, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైలులో ఉన్న ఓ నిందితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి స్వయంగా పోలీస్ బాసే రూ.5లక్షలు స్వాహా చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. టైర్లు దొంగిలించిన నిందితుడి వద్ద నుంచి రూ.5 లక్షలు స్వాహా చేసిన కేసులో రాచకొండకు చెందిన ఇన్‌స్పెక్టర్‌పై విచారణ ప్రారంభమైంది. నిందితుడు జైలులో ఉన్నప్పుడు ఇన్‌స్పెక్టర్ డబ్బు విత్ డ్రా చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఓ చోరీ కేసులో నిందితుడు అగర్వాల్‌ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలోనే పోలీసులు అగర్వాల్ డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.

Also Read : మ‌ద్యం మ‌త్తులో స్నేహితుడి హ‌త్య‌

నిందితుడికి బెయిల్ ఇచ్చినప్పుడు, అతని కార్డుపై భారీ విత్‌డ్రాలను నిందితుడు గుర్తించాడు. వెంటనే లావాదేవీల వివరాలను పొందేందుకు బ్యాంకును సంప్రదించాడు. దుర్వినియోగం జరిగిందని గ్రహించిన నిందితుడు వెంటనే రాచకొండ పీఎస్‌కు చెందిన ఉన్నతాధికారులను సంప్రదించాడు. వెంటనే రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో నిందితుడి బ్యాంకు ఖాతా నుంచి ఓ ఇన్స్పెక్టర్ రూ.5 లక్షలు విత్ డ్రా చేసినట్టు తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube