పోలీసు వృత్తి అత్యంత కఠినవంతమైనది

పోలీసు వృత్తి అత్యంత కఠినవంతమైనది

0
TMedia (Telugu News) :

పోలీసు వృత్తి అత్యంత కఠినవంతమైనది

– జిల్లా ఎస్పీ రక్షిత కె.మూర్తి

టీ మీడియా, నవంబర్ 3, వనపర్తి బ్యూరో : పోలీస్ వృత్తి అత్యంత కఠినతరమైనదని, చలి, ఎండ, వానలను లెక్క చేయకుండా, అన్నిరకాల వాతావరణ పరిస్థితులలో రాత్రనక, పగలనగ విధులు నిర్వహించవలసి ఉంటుంది కావున పోలీస్ సిబ్బంది అధికారులు ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రతలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రక్షిత కె. మూర్తి అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా సిబ్బంది కొరకు వచ్చిన (ఉల్లన్ జాకెట్స్) చలి మరియు రెయిన్ కొట్స్ లను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది.

Also Read : బెయిల్‌ మీద బయట తిరుగుతున్న ఖైదీ రేవంత్‌ రెడ్డి

ప్రతిఒక్కరు వ్యక్తిగతంగా వారి ఆరోగ్యం వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. పోలీస్ శాఖ గుర్తులతో కూడిన చలి రెయిన్ కోటు, ఇతర వస్తువులను జాగ్రత్త చేసుకోవడం, పోలీస్ సిబ్బంది మాత్రమే వినియోగించుకోవడం గుర్తుంచుకోవలసిన అంశమని ఎస్.పి. తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ అప్పలనాయుడు , స్టోర్ ఇంఛార్జి సుదర్శన్ పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube