పబ్‌ కేసులో నలుగురిపై కేసు

పబ్‌ కేసులో నలుగురిపై కేసు

1
TMedia (Telugu News) :

పబ్‌ కేసులో నలుగురిపైకేసు

టి మీడియా, ఏప్రిల్ 4 హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్‌ వంశీధర్‌రావు, పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ ముప్పల, ఈవెంట్‌ మేనేజర్‌ అనిల్‌, వీఐపీ మూమెంట్‌ చూసే కునాల్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్‌ పబ్‌లోకి ఎలా వచ్చాయనే దానిపై వీరిని విచారిస్తున్నారు. సీసీ టీవీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పబ్‌లో ఐదు గ్రాముల కొకైన్‌, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు చాక్లెట్‌ రోల్స్‌లో ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ పెట్టుకుని సేవించినట్టు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.

Also Read : ఉగ్ర కలకలం ఐసిస్ సానుభూతిపరుడి అరెస్ట్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube