పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

1
TMedia (Telugu News) :

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
టి మీడియా,ఆగస్టు 4, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

 

Also Read : గీత కార్మికునికి రు15000 లుఆర్థిక సహాయం

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా సీసీసీ
రాష్ట్రం ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని నిర్మించింది. ఏడెకరాల స్థలంలో రూ.600కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసింది.ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలను కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే కేంద్రంలో అన్నిశాఖల సమన్వయానికి సైతం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే ,లో ఉన్న ఈ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీక్షించవచ్చు. అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానించారు. అక్కడి నుంచి ఫీడ్‌ను నేరుగా సీసీసీ జోడించారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సైతం సీసీసీతో అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. 20 అంతస్తులున్న టవర్‌ ఏలోని 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube