పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

2
TMedia (Telugu News) :

పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

టి మీడియా,ఎప్రిల్ 25,హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.
ఎస్ఐ పోస్టుల వివ‌రాలు..

Also Read : మేనకోడలిని ఖతం చేసేందుకు రూ. లక్షతో సుపారీ

 

సివిల్ ఎస్ఐలు -414
ఏఆర్ ఎస్ఐలు -66
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు -05
టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు -23
స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు -12
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -26
జైళ్ల శాఖ -08
ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు -22
పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ – -3
ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు -08
కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు..

సివిల్ కానిస్టేబుల్స్ -4965
ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423
ఎస్ఏఆర్ సీఎల్ – 100
టీఎస్ఎస్‌పీ – 5010
స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ – 390
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610
జైళ్ల శాఖ(పురుషులు) – 136
జైళ్ల శాఖ(స్త్రీలు )-10
ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube