పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 26 మహానంది

పోలీసు అమరవీరుల వారోత్సవాలలోభాగంగా ప్రతీ ఏటా
అమరవీరుల పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మంగళవారం మహానంది పోలీస్ స్టేషన్ లో ఎస్సై సీసీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఒపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు
మహానంది పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను,పోలీస్ యొక్క విధులు గురించి పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి ,

పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాల గురించి మహనంది గురుకుల పాఠశాల విద్యార్దిని, విద్యార్దులు తగు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు
పోలీసు శాఖలో చేరే విధంగా ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఉత్సాహాన్ని కల్పిస్తున్నామన్నారు.
ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మహనంది పోలీసు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube