శాంతియుత ఆందోళనలపై పోలీస్ నిర్బంధాలా.?
సిటు జిల్లా కమిటీ
టి మీడియా,మార్చి 14,కడప:
ప్రజాస్వామ్యయుతంగా జరిగే శాంతియుత ఆందోళనలపైనా నిర్బంధ చర్యలను అమలు చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈ రోజు కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనురు. శ్రీనివాసులురెడ్డి, జి. రాజమని మాట్లాడుతూ
రాష్ట్రంలో, జిల్లాలో ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందని, జగన్ రెడ్డి, పోలీస్ రాజ్యం నడుస్తున్నట్టుగా ఉందని అన్నారు. ఈ తీరును మార్చుకోకపోతే జిల్లాలోని కార్మికవర్గం మొత్తం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగాల్సివస్తుందని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ సమస్యలపై శాంతియుతంగా ఆందోళనలు నిర్వహంచి, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమనుది ఆనవాయితీగా వస్తోందని, ఆ సమస్యలపై అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా స్పందించేవని చెప్పారు.
Also Read : వంట నూనెల ధరలకు ప్రభుత్వం కళ్లెం
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారిందని, ఆందోళనలకు అనుమతి ఇవ్వకపోవడమే కాక,ముందుస్తు అరెస్టులు, నిర్బంధాలతో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
విజయవాడ పోలీస్ కమిషనర్‌ను శాంతియుత ఆందోళనలకు అనుమతి కోరితే తన చేతిలో ఏమీ లేదని చెబుతూనే ఆందోళనలు చేస్తే అరెస్ట్ చేస్తామని అంటున్నారని, ఇదేం పద్దతని ప్రశ్నించారు.
ధర్నా, సమ్మె నోటీసులు ఇచ్చిన నాటి నుండి సంబంధిత రంగాల యూనియన్ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా, గేట్లు దూకి ఇళ్లలోకి వెళ్లడం, నోటీసులు ఇవ్వడం, ముందస్తు అరెస్టుల వంటివి చేస్తున్నారని, దీంతో సాధారణ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు
ఇటువంటి చర్యలు గతంలో ఎనుడూ లేవని అన్నారు. దొంగలు, గంజాయి, డ్రగ్స్ అమ్మేవారు, భూకబ్జాదారులను వేటాడాల్సిన పోలీసులను న్యాయమైన సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేవారిపై ప్రయోగించడం దారుణమన్నారు.
ఇటీవల విఆర్ఎ, మిరపరైతు, మున్సిపల్ కార్మికులు, నేడు మధ్యాహుభోజన కార్మికులు, ఆంగన్ వాడీల పై పోలీసులు నిర్బంధాలు,ఆశా కార్యకర్తల, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తక్షణమే వీటిని ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు.ఇదే కొనసాగితే ప్రభుత్వానికి కాలం చెల్లినట్టేనని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
Also Read : లోక్‌సభలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర బడ్జెట్
సిఎం కార్యాలయంలో ప్రజాసమస్యలు వినేవారు లేరని, జిల్లా యంత్రాగం అందుబాటులో ఉండడంలేదని చెప్పారు. ఉద్యోగాల్లోనుండి తీసేసిన వారిని వెనక్కి తీసుకోవాలని, పోరాడిన వారిపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజునే 37మంది మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని తెలిపారు.ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే భద్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా సిఎం తీరు మార్చుకుని, శాంతియుత పోరాటాలకు అనుమతినిచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంగం జిల్లా కార్యదర్శి జి.రాజమని,కుమారి తదితరులు పాల్గొన్నారు.