పోలీస్ లు భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి

పోలీస్ లు భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి

0
TMedia (Telugu News) :

పోలీస్ లు భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి

– జిల్లా ఎస్పీ రక్షిత కె. మూర్తి

టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ, వనపర్తి జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది చేయాల్సినవి/ చేయకూడని విధుల జాబితాను సిద్ధం చేసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా *ఎస్పీ రక్షిత కె మూర్తి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు తమ హక్కును స్వేచ్చగా సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియంత్రణలో పోలీస్ యంత్రాంగం క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. పోలింగ్ స్టేషన్‌లో విధులలో ఉన్న స్టాటిక్ పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లు తమ ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్, పోలింగ్ స్టేషన్‌ చుట్టూ తిరగకుండా చూసుకోవాలన్నారు. ఓటింగ్ చివరి గంటలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ యొక్క 100 మీటర్ల వ్యాసార్థంలో గుమిగూడడం/వాహనాలు నిలపడం వంటి లేకుండా చూడలన్నారు. పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ మొబైల్ పార్టీ ఇంచార్జీ , క్యూఆర్టి/ ఎస్ఎస్టీ మొదలైన ముఖ్యమైన ఫోన్ నంబర్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Also Read : మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి దీవించండి

ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మొబైల్ పార్టీకి లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం తెలియజేయాలన్నారు. ఓటర్లను క్యూలైన్లో నిలబెట్టాలని, అగ్గిపెట్టెలు, యాసిడ్, సెల్ ఫోన్లు, ఇంక్ పెన్నులు, నీళ్ల సీసాలు, మారణాయుధాలు, తుపాకీలు మొదలైన నిషేధిత పదార్థాలతో ఎవరినీ పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించవద్దన్నారు. ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా అభ్యర్థించకపోతే ఏ పోలీసు అధికారి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకూడదన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube