పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ చేసిన ఇంచార్జ్ డీసీపీ

పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ చేసిన ఇంచార్జ్ డీసీపీ

1
TMedia (Telugu News) :

పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ చేసిన ఇంచార్జ్ డీసీపీ
టీ మీడియా, మే 26,రామగుండం: పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ రామగుండం సర్కిల్ పరిధిలోనీ ఎన్టీపీసీ, రామగుండం, అంతర్గం పోలీస్ స్టేషన్ లను పెద్దపల్లి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, తో కలిసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను, అంతర్గం పోలీస్ స్టేషన్ నూతన భవన ను పరిశీలించడం జరిగింది.అనంతరం పోలీస్ స్టేషన్ ల తనిఖీ చేసి పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.అలాగే నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏ.సి.పి గారు తెలిపారు. సిబ్బంది తో మాట్లాడి పోలీస్ స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ మరియు వర్టికల్స్ విధానాన్ని అమలు చేయాలని, బ్లూ కోట్ విధులు,పెట్రో కార్ యొక్క విధులు, పిటిషన్ మేనేజ్-మెంట్ మరియు పోలీస్ స్టేషన్ యొక్క పనితిరును రిసెప్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్రైమ్ వెహికల్స్, అబండెడ్ వెహికల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

Also Read : మిషన్ భగీరథతో ధ్వంసమైన రోడ్లు

 

పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారితో మర్యాదగా మెలాగలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. అదేవిధంగా పాత నెరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు. సైబర్ నేరాలపై రోడ్డు భద్రత నియమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.ఏసీపీ గోదావరిఖని గిరి ప్రసాద్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మి నారాయణ,ఏన్టీపీసీ ఎస్ఐ కుమార్, రామగుండం ఎస్ ఐ సంతోష్, అంతర్గం ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube