పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలక పాత్ర వహించాలి

పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలక పాత్ర వహించాలి

0
TMedia (Telugu News) :

పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలక పాత్ర వహించాలి

– ఎస్పీ రక్షిత కె మూర్తి

టీ మీడియా, డిసెంబర్ 20, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి ఆదేశానుసారం వనపర్తి జిల్లా స్టేషన్ రైటర్ వర్టికల్ ఇంచార్జ్ ఎస్సై సంతోష్, డి సి ఆర్ బి ఎస్సై వనపర్తి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో స్టేషన్ రైటర్లతో వర్టికల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్‌ స్టేషన్‌ల్లో స్టేషన్‌ రైటర్లు వృత్తిపై విధేయ త, క్రమశిక్షణ, నిబద్ధత కలిగి ఉండాలని స్టేషన్‌ రైటర్స్‌ వర్టికల్‌ ఇన్‌చార్జి శంకర్‌ అన్నారు. జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్‌ రైటర్స్‌కు బుధవారం జిల్లా సమావేశ మందిరంలో ఒక రోజు జిల్లా పోలీసు స్టేషన్ రైటర్స్ తో శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌ రైటర్లు పోలీ స్‌ స్టేషన్‌ స్థాయిలో పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలక పాత్ర వహించాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ల్లో 5 ఎస్‌ వి ధానం అమలులో స్టేషన్‌ రైటర్స్‌ ముఖ్య పాత్ర పో షించాలన్నారు.

Also Read : గాయత్రి విద్యానికేతన్ లో భగవద్గీత పఠన పోటీలు

ఉన్నతాధికారుల సూచనల మేర కు సిబ్బందిని సమన్వయం చేస్తూ విధులను కేటాయించాలని, కేసుల దర్యాప్తు సరైన రీతిలో జరుగుటంలో సహకరించాలన్నారు. రికార్డ్స్‌, ఫైల్స్‌, సర్క్యులర్‌లు నిర్దేశిత ప్రదేశంలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎస్‌హెచ్‌వోల ఆదేశాల మేరకు అవసరమైన సమాచారాలు, నివేదికలు సకాలంలో సంబంధిత అధికారులకు పంపించాలని ఆదేశించారు ఇట్టి సమావేశంలో డిసిఆర్బి సిబ్బంది ఈశ్వర్ వనపర్తి జిల్లా అన్ని పోలిస్ స్టేషన్‌ రైటర్లు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube