జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

1
TMedia (Telugu News) :

జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
టి మీడియా,జూన్15,ఖమ్మం :రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకాలపాలకు చెక్ పెట్టేందుకు జిల్లాలో పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలను అడ్డుకట్ట వేసేందుకు డ్రంకెన్ & డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ తో పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Also Read : బాసర ట్రిపుల్‌ ఐటీ: స్పందించిన కేటీఆర్‌

జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, మాదక ద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు వంటి వాటి యొక్క అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు. అనుమానిత వ్యక్తులు గాని, వాహనాలు గాని తారసపడితే వాటి గురించి పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు.

Also Read : ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై స్పెషల్‌ ఫోకస్‌: సీఎం జగన్‌

అదేవిధంగా బైక్‌ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్ టిజింగ్, అర్ధరాత్రి రోడ్లపై పుట్టిరోజు వేడుకలు చేస్తూ… అసాంఘీక కార్యకాలపాలపై ప్రత్యేక దృష్టి సారించి చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచనలతో పోలీస్ అధికారులకు దృష్టి సారించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube