ఏజెన్సీ ప్రాంత వాసులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు

ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

0
TMedia (Telugu News) :

ఏజెన్సీ ప్రాంత వాసులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు

– ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

టి మీడియా, ఫిబ్రవరి 21, భద్రాచలం : పినపాక మండలం పిట్టతోగు గుత్తి కోయ గ్రామంలో సోలార్ వీది లైట్లను ప్రారంభించిన జిల్లా ఎస్పీ.ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పినపాక మండలానికి చెందిన పిట్టతోగు గుత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 05 సోలార్ విద్యుద్దీపాలను,జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ప్రారంభించారు.అదే విధంగా గ్రామంలోని 22 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున దోమ తెరలను అందజేసారు.ఇందులో భాగంగానే తిర్లాపురం,నీలాద్రిపేట,నెమలిగూడెం,పడిగాపురం గుత్తికోయ గ్రామాలకు కూడా మొత్తం 22 సోలార్ విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.తరువాత అక్కడ ఉన్న యువకులకు వాలీ బాల్ కిట్ ను అందజేసి వారితో కలిసి సరదాగా ఆటలో పాల్గోన్నారు.అనంతరం ఎస్పీ గారు జిల్లా గ్రామస్తులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి వలస వచ్చి జీవనం సాగిస్తున్న గుత్తికోయ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వారి సంక్షేమం,అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గుత్తికోయ గ్రామాల్లో ముందుగా సోలార్ వీది దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

Also Read : గవర్నర్ కి వినతి పత్రం అందించిన పొదెం వీరయ్య

తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్న పోలీసువారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.నిరంతరం గుత్తికోయ గ్రామాలను సందర్శిస్తూ,వారికి కనీస సౌకర్యాలను సమకూర్చటానికి కృషి చేస్తున్న మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్,ఎస్సై నాగుల్ మీరా మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,సిఐ రాజగోపాల్,ఎస్సై నాగుల్ మీరా మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube