రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా: సీపీఐ నారాయణ

రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా: సీపీఐ నారాయణ

1
TMedia (Telugu News) :

రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా: సీపీఐ నారాయణ
టి మీడియా,జూలై1,హైదరాబాద్‌: రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఈడీలను ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా అని నిలదీశారు. ప్రధాని మోదీ ఫెడరల్‌ స్ఫూర్తిని ధ్వంసం చేయదల్చుకున్నారా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే రాష్ట్రాల్లో అదే పార్టీ అధికారంలో ఉండాలన్నది ఎక్కడాలేదని వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర రాజకీయాలను కేంద్రం పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Also Read : శ్రీవారి సేవలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

 

శివసేన ప్రభుత్వంతో బీజేపీకి ఏం పని ప్రశ్నించారు.ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తామని మేనిఫెస్టోలో పెట్టారా అని నారాయణ ఆగ్రహం వ్యక్తచేశారు. ఎనిమిదేండ్లలో ఒక్క పబ్లిక్‌ సెక్టార్‌ను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దేశంలో బలహీన ప్రధానులు ఉన్నా పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మోదీ హయాంలో 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని చెప్పారు. 28 మంది బ్యాంకులకు రూ.20 లక్షల కోట్లు కొల్లగొట్టి పారిపోయారని చెప్పారు. వారిలో మాల్యా తప్ప మిగిలిన 27 మందిలో గుజరాతీలే ఉన్నారని విమర్శించారు. యూపీఏ హయాంలో సొంత పార్టీ నేతలు కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.

Also Read : రౌడీ షీటర్ల కార్యకలపాలపై నిఘా పెట్టండి

మోదీ ప్రధాని అయిన తర్వాత రూ.85 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని నారాయణ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్లధనం మొత్తం తెల్లధనంగా మారిందని విమర్శించారు. నోట్ల రద్దుతో పేద ప్రజలే నష్టపోయారని, రూ.2.5 లక్షల కోట్లు కమీషన్‌ రూపంలో బీజేపీకి వెళ్లిందని ఆరోపించారు. మేకప్‌ కోసం నెలకు రూ.75 లక్షలు ఖర్చుపెట్టే ప్రధానిని, ఒక్కరోజు 14 డ్రెస్సులు మార్చే పీఎంని ఇంతవరకు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. దేశ సంపదను దోపిడీ చేస్తున్నారంటే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube