బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ ఖాయం
బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ ఖాయం
బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ ఖాయం
– మంత్రి హరీశ్ రావు
టీ మీడియా, అక్టోబర్ 28, ఆదిలాబాద్ : ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకమని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు గెలిచినా కాంగ్రెస్ ఏం చేసిందని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు ఏజెన్సీలో విష జ్వరాలు, అంటు రోగాలు లేవని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణలో 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే బోర్ల దగ్గర మీటర్లు వస్తాయన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందన్నారు.
Also Read : ఎమ్మెల్యే సైదిరెడ్డి, దిష్టిబొమ్మ దాహనం
రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ అని తెలిపారు. ఎకరాకు రూ.10వేలు ఇచ్చామన్న ఆయన రూ.16 వేలకు పెంచబోతున్నామని వెల్లడించారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో కూడా తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అన్నారు. అధికారంలోకి రాగానే రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. రేషన్ షాపు ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తామన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube