మతతత్వం, మత మార్పిడి బిజెపి ఈ రెండే తెలుసు

మతతత్వం, మత మార్పిడి బిజెపి ఈ రెండే తెలుసు

0
TMedia (Telugu News) :

మతతత్వం, మత మార్పిడి బిజెపి ఈ రెండే తెలుసు

– ఛత్తీస్‌గఢ్‌ సిఎం

టీ మీడియా, నవంబర్ 2, రాయ్ పూర్‌ : బిజెపికి మతతత్వం , మత మార్పిడి అనే రెండు అంశాలే ఉన్నాయి. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయటం బిజెపికి అలవాటుగా మారిందని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ విమర్శించారు. కాషాయ నేతలు ఏ పనీ చేయరు, ప్రజలతో పోరాడి ఓట్లు సేకరించరు. వారి మనసులో ద్వేషం, హింస ఉన్నాయి” అని బస్తర్‌లో జరిగిన సభలో సీఎం బఘేల్‌ అన్నారు. రాష్ట్ర మాజీ సీఎం రమణ్‌సింగ్‌పై విరుచుకుపడుతూ, ”రమణ్‌సింగ్‌ హయాంలో బస్తర్‌లోని ఈ పచ్చని నేల ఎర్రగా మారింది. అన్న వ్యాఖ్యలపై సీఎం కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరుగుతుంది.

Also Read : మరో ఆప్‌నేత నివాసంపై ఈడి దాడులు

ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చింది. అంతకుముందు 2018 అసెంబ్లీ ఎన్నికలలో, 15 సీట్లు కైవసం చేసుకున్న అప్పటి అధికార బీజేపీకి వ్యతిరేకంగా 90 సీట్లలో 68 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ భారీ విజయాన్ని సాధించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube