నాడు తండ్రుల మధ్య పోరు..

-నేడు తనయుల మధ్య సమరం.

0
TMedia (Telugu News) :

నాడు తండ్రుల మధ్య పోరు..

-నేడు తనయుల మధ్య సమరం.

టీ మీడియా, నవంబర్ 2,నాగార్జున సాగర్‌ : గెలుపు ఎవరిదో. సాధారణంగా దాయాదుల పోరు.. మాదిరిగానే రాజకీయ పోరు కూడా అలాగే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో మాత్రం నాడు తండ్రుల మధ్య పోరు జరగ్గా, నేడు తనయుల మధ్య సమరం జరుగుతోంది. ఇలాంటి పోరు ఎక్కువగా ఏపీ లోని రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తూ ఉండేది. కానీ తెలంగాణలో కూడా ఆసక్తికరమైన ఎన్నికల పోరు జరుగుతుంది. నాగార్జున సాగర్ పేరు చెప్పగానే ప్రపంచ పర్యాటకకేంద్రం, తెలుగు రాష్ట్రాలకు వర ప్రదాయని నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరు గుర్తుకు వస్తుంది.రాజకీయాలు, ఎన్నికల ప్రస్తావన రాగానే రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి గుర్తుకు వస్తారు. ఈ నియోజక వర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనత కలిగి ఉన్నారు.

Also Read : బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

గతంలో చలకుర్తిగా, ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా ఇందులో జానారెడ్డి ఏడు సార్లు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో సిపిఎం నేతగా పేరున్న నోముల నర్సింహయ్యపై జానారెడ్డి గెలుపొంది ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి చెందారు.నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో 2021లో సాగర్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి మరోసారి జానారెడ్డి పోటీ చేసినా ఓటమే పలుకరించింది. దీంతో జానారెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు.ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహ్మయ్య తనయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి బరిలో ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో తండ్రి నోముల నరసింహయ్య వెంట నడిచిన భగత్ రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

Also Read : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాపల‌దారు బీఆర్ఎస్..అందుకే ఆలోచించి ఓటేయండి

జానారెడ్డికి రాజకీయాల్లో తోడునీడగా ఉంటూ తనదైన ముద్ర వేసుకున్న జైవీర్ రెడ్డి.. నియోజకవర్గంలో గిరిజన చైతన్య యాత్ర పేరుతో విస్తృతంగా పర్యటించారు.ఇద్దరు యువకులే కావడంతో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఇద్దరు నేతలు మాటల తూటాలతో ఎన్నికల రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి నాడు తండ్రులు పోరు సాగించగా, నేడు వారు తనయులు సమరం సాగిస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube