సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌మిష్టిగా పోరాడతాం

మ‌మ‌తా బెన‌ర్జీ

1
TMedia (Telugu News) :

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌మిష్టిగా పోరాడతాం

– మ‌మ‌తా బెన‌ర్జీ
టీ మీడియా,సెప్టెంబర్ 8, కోల్‌క‌తా : న‌రేంద్ర మోదీ సార‌ధ్యంలోని బీజేపీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విప‌క్షం ఐక్యంగా పోరాడుతుంద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పారు. విప‌క్షాలు ఐక్యంగా ఉన్నాయ‌ని ఎన్నిక‌ల్లో తామంతా క‌లిసి పోరాడ‌తామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. నితీష్ కుమార్‌, హేమంత్ సొరెన్‌, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి ముందుకు సాగుతామ‌ని అన్నారు. రాజ‌కీయం అంటేనే యుద్ధ‌రంగ‌మ‌ని తాము 34 ఏండ్లుగా పోరాడుతున్నామ‌ని దీదీ పేర్కొన్నారు.

Also Read : హరగోపాల్‌కు కాళోజీ పురస్కారంపై హర్షం

రాజ‌కీయ పార్టీల్లో విభేదాల‌ను మీడియా గోరంత‌ను కొండంత‌లుగా చూపుతుంద‌ని ఆరోపించారు. గ‌తంలో త‌న‌కు అభిషేక్ బెన‌ర్జీ మ‌ధ్య విభేదాలున్నాయ‌ని చూపార‌ని, ఇలాంటి క‌ధ‌నాల‌తో టీఆర్పీ పెర‌గ‌ద‌ని ఆమె హిత‌వు ప‌లికారు. ప‌శువుల స్మ‌గ్లింగ్ కేసులో టీఎంసీ నేత అనుబ్ర‌త మొండ‌ల్ అరెస్ట్‌ను ప్ర‌స్తావిస్తూ అనుబ్ర‌త మొండ‌ల్ సాహ‌సిగా జైలు నుంచి తిరిగివ‌స్తార‌ని అన్నారు. బ‌డా నేత‌ల‌ను అరెస్ట్ చేస్తే కార్య‌క‌ర్త‌లు నిస్ప్ర‌హ‌కు లోన‌వుతార‌ని వార‌నుకుంటున్నార‌ని ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube