కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

బీజేపీలో చేరనున్న8 మంది ఎమ్మెల్యేలు

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..

-బీజేపీలో చేరనున్న8 మంది ఎమ్మెల్యేలు

టీ మీడియా, సెప్టెంబర్ 14, పనాజీ: గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ షెట్ తెలిపారు. వారిలో మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, మిచెల్‌ లోబో, డెలిలాహ్‌ లోబో, రాజేశ్‌ ఫల్‌దేశాయ్‌, కేదార్‌ నాయక్‌, సంకల్ప్‌ అమోన్కర్‌, అలెక్సియో సెక్వీరియ, ఉడాల్ఫ్‌ ఫెర్నాండేస్‌ ఉన్నారు.

Also Read : పెళ్లైన రెండో రోజుకే వరుడు మృతి

వీరంతా ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం ప్రమోద్‌ సావంత్‌తో భేటీ అయ్యారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 20 మంది, కాంగ్రెస్​కు 11 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 8 మంది బీజేపీలో చేరనుండటంతో ఆ సంఖ్య మూడుకు చేరనుంది. రెండు నెలలుగా కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు గోవా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, 2019 జులైలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదేవిధంగా మణిపూర్‌లో జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకున్నది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube