రైతుబంధు రాజ్యం కావాలా.. రాబందుల రాజ్యం కావాలా..?

రైతుబంధు రాజ్యం కావాలా.. రాబందుల రాజ్యం కావాలా..?

0
TMedia (Telugu News) :

రైతుబంధు రాజ్యం కావాలా.. రాబందుల రాజ్యం కావాలా..?

– మంత్రి సబితా

టీ మీడియా, నవంబర్ 15, రంగారెడ్డి : రైతుబంధు రాజ్యం కావాలా.. రాబందుల రాజ్యం కావాలా తేల్చుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తండా, దావుదు గుడా తండా, పెద్దమ్మ తండాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికారు. భారీగా హాజరైన తండావాసులు మేమంతా మీతోనే.. మీకు అండగా ఉంటామని ముక్తకంఠంతో తండావాసులు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంతోనే అన్ని రంగాలను అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరొకసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లా ఉండే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది అభివృద్ధి చేశానన్నారు.

Also Read : కాంగ్రెస్ ప్రచారాల్లో దూసుకుపోతున్న కార్యకర్తలు

మరింత అభివృద్ధి కోసం మీ సబితమ్మను ఆశీర్వదించి మరొకసారి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని, మరింత అభివృద్ధి కోసం మరొకసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి దీవించవలసిందిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, భారీగా పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube