సంక్రాంతికి గంగిరెద్దులోలె ఓట్లప్పుడు కాంగ్రెస్, బీజేపోళ్లు వస్తరు..
– వాళ్ల మాటలు నమ్మొద్దు
– మంత్రి కేటీఆర్
టీ మీడియా, నవంబర్ 15, వేములవాడ: కాంగ్రెస్, బీజేపీ నేతలు అన్నివేళల ప్రజల మధ్య కనిపించరని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం గంగిరెద్దులోలె వస్తరని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అట్ల వచ్చే కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ బుధవారం కథలాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరోసారి గెలిపిస్తే మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కొత్తగా మరో నాలుగైదు అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘సభకు చాలా పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. మీ దీవెనలు ఉంటే, ముఖ్యంగా ఆడబిడ్డల దీవెనలు ఉంటే కేసీఆర్ తప్పకుండా మూడోసారి ముఖ్యమంత్రి అయితరు. సభకు వచ్చిన మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు వస్తరు. ఇప్పుడు కూడా వాళ్లు కాకిరిబీకిరి లొల్లివెట్టుకుంట తిరుగుతున్నరు. మీరు వాళ్ల మాటలు నమ్మొద్దు. బాగా ఆలోచించి మనకు ఎవరు మంచి చేసిండ్రు..? ఇంకా ఎవరు మంచి చేయగలుగుతరు..? అని ఆలోచించి ఓటేయండి’ అని మంత్రి కేటీఆర్ సూచించారు.
Also Read : ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.
‘ఆడబిడ్డ పెండ్లి చేయాల్నంటే ఎన్ని ఆలోచించి చేస్తమో.. ఓటేసేటప్పుడు కూడా అట్లనే ఆలోచన చేయాలె. తెలంగాణ 2014లో ఎట్లుందో.. ఇప్పుడు ఎట్లుందో ఆలోచించాలె. ఆనాడు రూ.200 పెన్షన్ ఉండె. ఇయ్యాలా రూ.2 వేల పెన్షన్ అయ్యింది. నాడు 29 లక్షల మందికి పెన్షన్ వస్తుండె. నేడు 46 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్లలో చాలా మంది ఆడబిడ్డలు బీడీలు చుట్టి ఉపాధి పొందుతున్నరు.గతంలో ఏ పాలకుడన్నా బీడీ కార్మికులైన ఆడబిడ్డల గురించి పట్టించుకున్నడా..? ఇప్పుడు కేసీఆర్ రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నడు. 2014 కటాఫ్ పెట్టడంతోటి ఆ తర్వాత బీడీ కార్మికులు అయినోళ్లకు పెన్షన్ వస్తలేదు.
Also Read : కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక
ఈ ఎన్నికలు అయినంక కొత్త బీడీ కార్మికులకు కూడా బరాబర్ పెన్షన్ ఇస్తం. 4.5 లక్షల మంది పెన్షన్ ఇచ్చుకుంట, ఇంకో 40, 50 వేల మందికి ఇచ్చుడు కష్టమేం గాదు. ఊర్లళ్ల పెన్షన్‌లు రానోళ్లు గూడా కొంత మంది ఉన్నరు. కొత్తగా రేషన్ కార్డులు కావాల్సినోళ్లు ఉంటరు. అర్హులైన అందరూ దరఖాస్తులు పెట్టుండ్రి. డిసెంబర్ 3 తర్వాత అందరికీ పెన్షన్‌లు, రేషన్ కార్డులు ఇస్తం. నేనే బాధ్యత తీసుకుంటా’ అని మంత్రి హామీ ఇచ్చారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube