150 కోట్ల మంది భార‌తీయ‌లు చూపు కామారెడ్డి వైపే..

- చారిత్రాత్మ‌క తీర్పు ఇవ్వండి

0
TMedia (Telugu News) :

150 కోట్ల మంది భార‌తీయ‌లు చూపు కామారెడ్డి వైపే..

– చారిత్రాత్మ‌క తీర్పు ఇవ్వండి

– టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి

టీ మీడియా, నవంబర్ 15, కామారెడ్డి : 150 కోట్ల మంది కామారెడ్డి వైపు చూస్తున్నారని, కామారెడ్డి ఎన్నికల తీర్పు భారత దేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కోరారు. కామారెడ్డిలో జరిగిన ఎన్నిక‌ల కాంగ్రెస్‌ సభలో మాట్లాడుతూ, పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని, కేసీఆర్‌కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. ఎమ్మెల్యేగా ఎక్కడైనా గెలుస్త కానీ కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానికి కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డి రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. కర్ణాటకలో గెలిచినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ జెండా ఎగురవేస్తుంది.. ‘డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నాడు కేసీఆర్‌. తెలంగాణలో ఉచిత కరెంట్, మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మనతో లేరు కానీ ఆయన హయాంలో 12 వేల కోట్ల రూపాయల కరెంటు బకాయిల రద్దు చేశారు.

Also Read : సంక్రాంతికి గంగిరెద్దులోలె ఓట్లప్పుడు కాంగ్రెస్‌, బీజేపోళ్లు వస్తరు..

ప్రశ్న పత్రాల లీకేజీ , ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్‌ మాట్లాడతలేడు అంటూ రేవంత్ విరుచుకుప‌డ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమ‌ని,. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్‌లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటాన‌ని మ‌రోసారి తేల్చి చెప్పారు టిపిసిసి చీఫ్.. నేడు 3 గంటల వరకు నామినేషన్‌ ఉపసంహరణకు టైం ఉంది. లాగ్‌బుక్‌లు తీసుకుని కామారెడ్డికి రా’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube