40 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించారు

- బిఆర్ఎస్ కో ఆప్షన్ సభ్యులు సుజాత అద్వానీ

0
TMedia (Telugu News) :

40 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించారు

– బిఆర్ఎస్ కో ఆప్షన్ సభ్యులు సుజాత అద్వానీ

టీ మీడియా, నవంబర్ 18, కొత్తకోట: దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండల కేంద్రంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచార భాగంలో బిఆర్ఎస్ కోఆప్షన్ సభ్యులు సుజాత అద్వానీ మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు కనిపించే కాంగ్రెస్ కావాల్నా ,.?? ప్రజల మధ్యలో ఉండే ఎమ్మెల్యే ఆల కావాల్నా…?? అంటూ ఓటర్లను ప్రశ్నించారు..?? దేవరకద్ర నియోజకవర్గంలో గత 45 ఏళ్లలో జరగని అభివృద్ధిని, ఎమ్మెల్యే ఆల నాలుగేళ్లలో చేసి చూపించారని కొత్తకోట మండల కో ఆప్షన్ సభ్యులు సుజాత అద్వానీ అన్నారు. అధికారం మకుటం కాదు, పనిచేయడానికి ఆయుధంగా ఉపయోగించుకున్నామని, ప్రతి గ్రామంలో స్కూల్స్, రోడ్లు మున్సిపాలిటీలో రోడ్డు, డ్రైనేజీ పనులు అభివృద్ధి చేశామని, అభివృద్ధి పనులు చేసినందున ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం వచ్చింది అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు అందినట్లు తెలిపారు. కెసిఆర్ అందని పథకాల ఊరు, అందని గ్రామం లేదన్నారు. అధికారం కోసం 100 అబద్ధాలు చెప్పే వారికి ఓట్లు వేయొద్దని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆలన్న కార్యాలయం ప్రధాన డోర్ లేని, కార్యాలయంగా పనిచేస్తుందని, ఎప్పుడు వచ్చినా, ఎవరు వచ్చిన, పనులు చేస్తూనే ఉంటామన్నారు. ఎన్నికలప్పుడు కనిపించే కాంగ్రెస్ పార్టీ కావాలా…?? ప్రజల మధ్యలో ఉండే ఆలన్న కావాలా…?? ఆలోచించుకోవాలని సుజాత అద్వానీ అన్నారు.

Also Read : కొత్తకోటలో బిస్పీ పార్టీలో మైనార్టీ మహిళలు చేరిక

నీళ్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అధికారం తప్ప ప్రజల అవసరాలు తెలియని నాయకులు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సి డి సి చైర్మన్ బిసం చెన్నకేశవరెడ్డి, కొత్తకోట మండల కో ఆప్షన్ సభ్యులు సుజాత అద్వానీ, మాజీ సీడీసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ పద్మా వెంకటేష, రాంబాబు, సావిత్ర, రవి, తిరుపతయ్య, శ్రీనివాస్, కొండన్న, కె.వెంకటేష్, ఏం.నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube