తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్..సున్నం పెట్టేది కాంగ్రెస్
తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్..సున్నం పెట్టేది కాంగ్రెస్
తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్..సున్నం పెట్టేది కాంగ్రెస్
– మంత్రి జగదీష్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 21, సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్ అయితే..సున్నం పెట్టేది కాంగ్రెస్ అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్, కోటపహడ్, శెట్టిగుడెం, జొట్య తండా, అశ్లా తండా లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కారు గుర్తుకు వేసిన ఓటు రైతుల బీడు భూములను సస్యశ్యామలం చేసింది అన్నారు. 25 ఏండ్లు దామోదర్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ది శూన్యం అన్నారు. దామోదర్ రెడ్డి మా గ్రామానికి ఈ పని చేసిండని చెప్పే దమ్ము ఏ గ్రామ కాంగ్రెస్ నాయకుడికైనా ఉందా? అంటూ సవాల్ విసిరారు. విస్నూర్ రామచంద్ర రెడ్డి వారసుడు దామోదర్ రెడ్డి అయితే నేను బి.ఎన్, ధర్మ భిక్షం వారసుడినని పేర్కొన్నారు. ఆయనకు చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలన్నారు. సూర్యాపేటలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత నాదే అన్నారు.
Also Read : ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టకు 415 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయండి
ఆశీర్వదించండి మీ ఇంటి వాడిగా సేవ చేస్తానని విజ్ఞప్తి చేశారు. మంత్రి ప్రచారం సందర్బంగా కోటపహడ్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు కందాల ఆనంద్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు జానయ్య , రమేష్, లింగయ్య, లతీఫ్, సురేష్, మల్లయ్య, గణేశ్, గంగయ్య, లక్ష్మారెడ్డి తో పాటు యూత్ అద్యక్షుడు వెంకటేష్‌తో పాటు పలువురు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube