బ్రహ్మం గారు సైతం చెప్పనిది.. కేసీఆర్ చేసి చూపించారు

బ్రహ్మం గారు సైతం చెప్పనిది.. కేసీఆర్ చేసి చూపించారు

0
TMedia (Telugu News) :

బ్రహ్మం గారు సైతం చెప్పనిది.. కేసీఆర్ చేసి చూపించారు

– మంత్రి హరీశ్‌ రావు

టీ మీడియా, నవంబర్ 22, సిద్దిపేట : బీఆర్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములను పట్టా భూములు చేస్తాం. హక్కులు కల్పిస్తాం. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇక్కడ రూపాయి పని చేయలేదు. ఢిల్లీ నుంచి ఏమీ తెలేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బుధవారం దుబ్బాక, మిరుదొడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీజేపీ వాడు గెలిస్తే బోరుబాయి కాడ మోటర్ వస్తది అని అనాడే చెప్పాను. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 25 వేల కోట్లు ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఇప్పుడు రఘునందన్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని మంత్రి సూటిగా ప్రశ్నించారు. మీ మంత్రి స్వయంగా చెప్పారు. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ వచ్చిందా లేదా? కర్ణాటక డిప్యూటీ సీఎం ఇక్కడ మాట్లాడాడు. అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పాడు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అసలు రంగు బయట పడిందన్నారు. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గెలవాలి. అక్కడ కేసీఆర్ గెలవాలి. మంచి నీళ్లు ఇంటింటికీ ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కూడవెల్లి వాగు ఎండాకాలంలో మత్తల్లు దుకుతున్నాయు. కలలో కూడా కననిది, బ్రహ్మం సైతం చెప్పనిది కేసీఆర్ చేసి చూపెట్టారని మంత్రి తెలిపారు. మేనిఫెస్టోతో పాటు రామక్క పాటను కూడా కాంగ్రెస్, బీజేపీలు నఖల్ కొట్టాయని ఎద్దేవా చేశారు.

Also Read : అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

రామక్క పాట తెలంగాణలో దుమ్ము రేపుతున్నది. పార్టీ కాదు, కేసీఆర్ మీద ప్రేమతో కల్వకుర్తికి చెందిన ఒక చెల్లి రాసిన పాటకు కాంగ్రెస్, బీజేపీల గుండెలు జల్లుమంటున్నాయని పేర్కొన్నారు. మన ప్రభుత్వం వస్తుంది. కొత్త ఏడాది జనవరి నుంచి రేషన్ మీద పాత సోనా మసూరి సన్నబియ్యం ఇవ్వబోతున్నం. నూకలు బుక్కుమన్న బీజేపీకి నూకలు లేకుండా చేయాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube