కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే రాష్ట్రం కుక్కల చింపిన విస్తరే

కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే రాష్ట్రం కుక్కల చింపిన విస్తరే

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే రాష్ట్రం కుక్కల చింపిన విస్తరే

– మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

టీ మీడియా, నవంబర్ 22, మహబూబ్‌నగర్‌ : కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మహబూబ్‌నగర్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఎంతో అభివృద్ధతి చేశారన్నారు. గతంలో పాలమూరు పరిస్థితి ఎలా ఉండోదో మనకు తెలుసు. వలసలు, ఉరితాళ్లు, నీళ్లు అరిగోస పడేవాళ్లమన్నారు. కేసీఆర్‌ పోరాడి తెలంగాణను సాధించాక పాలమూరు తలరాత మార్చాడన్నారు. నీళ్లులేక నోళ్లు తెరిచిన చెరువులు, కుంటలు, నేడు పంట పొలాలతో విలసిల్లుతున్నాయన్నారు. నేడు ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్నం. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు పని చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా పని చేస్తున్నాం.

Also Read : బీఆర్ఎస్ తోనే మైనార్టీల సంక్షేమం

కొంతమంది కుల,మత రాజకీయాలతో గెలువాలని చూస్తున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ రౌడీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే రాష్ట్రం కుక్కల చింపిన విస్తరి అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి మరింత కొనసాగాలంటే కేసీఆర్‌ను గెలిపించాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube