తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే యువతకు తీరని అన్యాయం

తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే యువతకు తీరని అన్యాయం

0
TMedia (Telugu News) :

తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే యువతకు తీరని అన్యాయం

– ఎమ్మెల్సీ కవిత

టీ మీడియా, నవంబర్ 23, నిజామాబాద్‌: దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్‌లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని యువతకు సూచించారు. యువతలో చైతన్యం రావాలని, స్వేచ్ఛాయుతంగా ఉండటం అనేది ముఖ్యమని తెలిపారు. నేడు మనకున్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలన్నారు. నిజామాబాద్‌లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఎమ్మెల్సీ కమిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలనగానే ఒక బ్రహ్మ పదార్థమని, తమకు సంబంధం లేదనే ఆలోచన నుంచి విద్యార్థులు బయటకు రావాలన్నారు. పట్టణాల కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. యువతలో చైతన్యం రావాలని, మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుందని తెలిపారు. ప్రశ్నించటం తెలంగాణ రక్తంలోనే ఉందని చెప్పారు. దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు దేశ ప్రజల స్వేచ్ఛను హరించారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్‌ అని, యువత తమ గొంతుకను వినిపించేందుకు ఉన్న సోషల్ మీడియాను వాడుకోవాలన్నారు.

Also Read : రాబోయే రోజుల్లో గీతా కార్మికులకు లునాలు ఇప్పిస్తాం

తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే.. దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. యువత భవిష్యత్‌పై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అడవుల శాతం పెరగలేదు.. కానీ తెలంగాణలో మన ప్రభుత్వ సంకల్పం వల్ల ఇది సాధ్యమైందని వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube