రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తులు నోరును అదుపులో పెట్టుకోవాలి
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
టీ మీడియా, ఫిబ్రవరి 11, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం, ప్రగతి భవన్ భవనాలను కూల్చివేస్తామని జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు రాష్ట్ర శాఖల అధ్యక్షులు రాజ్యాంగంపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండి పడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, అరూరి రమేశ్, దుర్గయ్య చిన్నయ్య మాట్లాడారు. దేశములో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించి దానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకుంటే కూల్చివేస్తామని బండి సంజయ్ పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు. అంబేద్కర్ అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరో నేత రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చివేస్తామని సైకో మాదిరిగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇద్దరు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
Also Read : దోమల నివారణకు బయోటిక్స్ స్ప్రే
రాజకీయ లబ్ధి , టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నూతన సచివాలయానికి కి అంబేద్కర్ పేరు పెట్టుకుంటే బండి సంజయ్ ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ను అవమానపరుస్తున్న సంజయ్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని, ఇద్దరినీ ఎర్రగడ్డ లో జాయిన్ చేయాలని అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube