నా రాజీనామాను ఆమోదించండి..

-ఎమ్మెల్యేగంటా శ్రీనివాస్

1
TMedia (Telugu News) :

నా రాజీనామాను ఆమోదించండి..

-ఎమ్మెల్యేగంటా శ్రీనివాస్

-ప్రధాని పర్యటనలో నిరసనకు నిర్ణయం

టి మీడియా, నవంబరు6,విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. వైసీపీ పాలన వల్లే రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుపరం అవుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గతంలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను స్పీకర్ ఆమెదించలేదు. దీంతో ఆయన మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కోరారు. రాజీనామా ఆమోదిస్తే స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని దృష్టికి వెళ్ళే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి రావడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నివాసంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘ ప్రెసిడెంట్ ఆదినారాయణ, సీఐటీయూ నేత అయోధ్య రామ్, అన్ని సంఘాల నేతలతో పాటు హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

Also Read : మంత్రగత్తె అనే నెపంతో మహిళ సజీవ దహనం

ఒక వేళ ప్రధానిని కలిసే అవకాశం రాకుంటే నిరసన చేపట్టాలని నిర్ణయించారు.స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గతం లో గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 11న ప్రధాని విశాఖలో పర్యటించనున్నారు. ఈ సమయంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే నిర్వాసితులు కూలీలుగా మారతారని వెల్లడించారు. కార్మికులు చేస్తోన్న పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా న్యాయపరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజా ఉద్యమంగా మార్చితే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.కాగా.. ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. 11న సాయంత్రం 5 గంటలకు పీఎం విశాఖ చేరుకోనున్నారు. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చే అవకాశం ఉంది. 12న ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో ప్రధాని మాట్లాడనున్నారు. సభకు కనీసం లక్ష మందిని తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube