ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌లు వీరే

ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌లు వీరే

1
TMedia (Telugu News) :

ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌లు వీరే

టి మీడియా,నవంబర్ 15, అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ మధ్య అక్కడ త్రిముఖ పోరు జరగనున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఒకడుగు ముందుకేసి తన ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం 40 మంది ప్రముఖుల పేర్లతో కూడిన స్టార్‌ క్యాంపెయినర్‌ల జాబితాను ప్రకటించింది.

Also Read : అధికారిక లాంఛనాలు తో నటుడు కృష్ణ అంత్యక్రియలు

అందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ నాయకులు సచిన్‌ పైలెట్‌, జిగ్నేశ్‌ మెవానీ, దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌ తదితరుల పేర్లు ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube