బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశం వినాశ‌న‌మే

డీ రాజా

1
TMedia (Telugu News) :

బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశం వినాశ‌న‌మే

– డీ రాజా

టీ మీడియా,నవంబర్ 16, హైద‌రాబాద్ : గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డీ రాజా స్ప‌ష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, అమిత్ షా ప్రసంగాలను పరిశీలిస్తే, ఆ నేతల్లో నిరాశ, భయాందోళనలు క‌న‌బ‌డుతున్నాయ‌న్నారు. 2024లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశం వినాశ‌న‌మ‌వుతుంద‌ని రాజా పేర్కొన్నారు. . బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తి నేప‌థ్యంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతాయ‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింద‌న్నారు. త్వరలో జరిగే త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు.

Also Read : జ‌ర్మ‌నీ కౌన్సుల్ జ‌న‌ర‌ల్‌తో మంత్రి కేటీఆర్‌ చ‌ర్చ‌లు

బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగితే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు.జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు శక్తులను ఏకాకిని చేసి 2024 ఎన్నికల్లో ఓడించాలని, ఇందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు, ప్రాంతీయ పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube