అభిలాష్ రావు నీ రంగులు మార్చు.

ఎమ్మెల్యే ను విమర్శించే స్థాయి నీది కాదు.

1
TMedia (Telugu News) :

అభిలాష్ రావు నీ రంగులు మార్చు.

– ఎమ్మెల్యే ను విమర్శించే స్థాయి నీది కాదు.

– తెరాస పార్టీ మండల ప్రజా ప్రతినిధిలు.

టీ మీడియా నవంబర్ 19 చిన్నంబావి : ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగినేని అభిలాష్ రావు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు,ఈ కంప్లైంట్ పై స్పందించిన చిన్నంబావి మండల ప్రజాప్రతినిధులు మండలం లోని కొప్పూనుర్ గ్రామం లోని రైతు వేదిక లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో చిన్నంబావి మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ మాట్లాడుతూ రాజకీయ కొత్త బిచ్చగాళ్లు తాలూకా మంచి కోరి మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే పై బురద చల్లాలని చూస్తున్నరని,ఎమ్మెల్యే పై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆమె అన్నారు.జెడ్పీటీసీ కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజా నాయకుడిగా ఎదుగుతున్న ఎమ్మెల్యే బీరం హార్షవర్ధన్ రెడ్డి ని మాట్లాడే అర్హత అభిలాష్ కు లేదు, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావో ఏ పార్టీ నుంచి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇప్పించావో తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి ఎమ్మెల్యే పై అనుచిత వాక్యాలు చేస్తే చిన్నంబావిలో నీ ఆటలు సాగవు అని జెడ్పిటిసి తనదైన శైలిలో హెచ్చరించారు.

Also Read : విరిగిపడ్డ మంచు చరియలు.. ముగ్గురు జవాన్లు మృతి

తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదన్న యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అనుచిత వాక్యాలు చేస్తేనే నన్ను ప్రజలు గుర్తి స్తారని చేతకాని రాజకీయం రంగినేని అభిలాష్ రావు చేస్తున్నారని అని ఈదన్న యాదవ్ అన్నారు.తన ప్రచారం కోసం తనను గుర్తు పట్టడానికి వాట్సప్ లలో సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక పని పాట లేని ఫోటోలతో రాజకీయ పాబ్బం గడిపే నీకు ఎమ్మెల్యే ను విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడిది ఎమ్మెల్యే ని విమర్శిస్తే సహించేది లేదని చిన్నంబావి ప్రజానీకం నిన్ను ఎవరు గుర్తించరు ఎమ్మెల్యే తో పోటీ అనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీ ప్రతాపం చూపించు అంతే కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఎమ్మెల్యే ని విమర్శిస్తే సహించం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మి,ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్,సీనియర్ నాయకులు చిన్నారెడ్డి,సింగిల్ విండో చైర్మెన్ నరసింహ రెడ్డి, డైరెక్టర్ డేగ శేఖర్ యాదవ్,బ్రహ్మo,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube