బీజేపి, బీఆర్ఎస్ లను సాగనంపుదాం.

గెలుపోటములు శాసించేది కమ్యూనిస్టులే.

0
TMedia (Telugu News) :

బీజేపి, బీఆర్ఎస్ లను సాగనంపుదాం.

– గెలుపోటములు శాసించేది కమ్యూనిస్టులే.

-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమట వెంకటేశ్వరరావు.

టి మీడియా, అక్టోబర్ 16,అశ్వాపురం : దేశ సమగ్రత, సమైఖ్యతకు విఘాతం కలిగించే బిజేపిని, ఆ బిజేపితో చికటి ఒప్పందాలు చేసుకుంటున్న బిఆర్ఎస్ లను గద్దె దింపేందుకు ప్రజా స్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజుఅశ్వాపురం సిపిఐ కార్యాలయంలో సోమవారం జరిగిన సిపిఐ పార్టీ మండల విస్తృత కార్యవర్గం కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మతోన్మాదం పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు ఆర్ఎస్ఎస్ అదేశాలను అనుసరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, రాముని పేరు జపిస్తూ రాక్షస పాలన సాగుస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బిజేపి ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే దేశం అదోగతిపాలవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా బిజేపికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్ని శక్తులను కలుపుకుని బిజేపిని, రాష్ట్రంలోనూ అదే తరహాలో బిఆర్ఎసు గద్దె దించేంత వరకు విశ్రమించేదే లేదన్నారు. రాజ్యాంగ పరమైన పాలన సాగాలి కానీ సొంత ఎజెండాను ప్రజలపై రుద్ది పరిపాలిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దేశంలో ధరలు నానాటికీ పైపైకి పోతున్నాయని, వాటిని అదుపుచేయడంలో మోడి విఫలమయ్యారన్నారు.

Also Read ; పలు కుటుంబాలకు ఎంపీ నామ పరామర్శలు

గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలతో సామాన్యుడు మనుగడ సాగించే పరిస్థితి లేదని, దీనికి పాలకుల విధానాలే కారణం అన్నారు. ప్రజలను మోసం చేయడంలో, మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్ దిట్ట అని, వివిధ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ ఘోరంగా మోసం చేశాడన్నారు. దళితబందు, బిసి బందు, మైనార్టీ బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి పథకం, ఉద్యోగ నోటిఫికేషన్లకు కేసీఆర్ కు గడిచిన ఐదేడ్లలో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రవేశపెట్టి ఏ పథకమూ పూర్తి స్థాయిలో అమలు చేయలేక చతికలపడిందని, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పథకాలకు అర్హులైన పేదల నిండా ముంచాడు విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారేగాని ప్రజల పక్షాన ప్రశ్నించే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ఉద్యోగులను గిసపెడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ పాలన ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గెలుపోటములు శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉందని, స్పష్టం చేశారు. ఉధ్యమాల పురిటిగడ్డ అయిన భద్రాది జిల్లాకు అనేక మంది వచ్చిపోతుంటారని, కానీ నిరంతరం ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు..

Also Read : పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలి

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మద్ది వెంకటరెడ్డి, సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్,సిపిఐ అశ్వాపురం మండలం సహాయ కార్యదర్శిలు, మేలపుర సురేందర్ రెడ్డి, రాయపూడి రాజేష్, ముత్తిబోయిన వెంకటేశ్వర్లు, ఈనపల్లి పవన్ సాయి, దండి నాగేష్, నవీన్, అక్కనపల్లి నాగేంద్రబాబు, ఇరుగు శ్రీకాంత్, రెడ్డిబోయిన వెంకన్న, ముద్దుశెట్టి నరసింహారావు, మహిళా మండల నాయకులు, తెల్ల వెంకటరమణ, తురక అచ్చమ్మ, తదితరులు హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube